పత్తి రైతుకు ఊరట | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు ఊరట

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

రాయికోడ్‌(అందోల్‌): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. దీంతో ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి దిగుబడి ఆశించిన మేర రావడం లేదు. అయితే ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో పత్తి ధర ఎక్కువగా పలుకుతుండటంతో రైతులకు కాస్త ఊరట కలిగిస్తోంది. సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌ పత్తికి రూ.8,667 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.9,500 పలుకుతోంది. ధర ఎక్కువగా ఉండటంతో పత్తి తీత ప్రారంభించిన రైతులు వెంటవెంటనే విక్రయిస్తున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్లు ఆశిస్తే సగం మాత్రమే వస్తోందని చెబుతున్నారు. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించిన అనంతరం ధర తగ్గుతుందా..? ఇదే ధర ఉంటుందా..? అని అయోమయంలో ఉన్నారు.

జిల్లాలో 3.57 ఎకరాల్లో పత్తి సాగు

జిల్లాలో ఈ సీజన్‌లో అత్యధికంగా 3.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మే, జూన్‌, జూలై, మాసాల్లో తగిన వర్షాలు కురిసినప్పటికీ ఆగస్టు నుంచి వర్షాలు ముఖం చాటేయడంతో పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో దిగుబడి సగానికి తగ్గింది. ఈనెలలో చుక్క వర్షం కురవలేదు. దీంతో రబీ పంటల దిగుబడిపై కూడా ప్రభావం పడనుంది. వ్యవసాయ శాఖ అధికారులు రబీ పంటల సాగు జోలికి వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.

ప్రైవేట్‌ వ్యాపారి కొనుగోలు చేసిన పత్తి

మార్కెట్‌లో మస్త్‌ డిమాండ్‌

ప్రభుత్వ ‘మద్దతు’ కంటే ఎక్కువ ధర

క్వింటాల్‌ పత్తి రూ. 9,500

తగ్గిన దిగుబడితో అన్నదాతకు కొంత మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement