క్రేన్‌ ఢీకొని భర్త దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

క్రేన్‌ ఢీకొని భర్త దుర్మరణం

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

వర్గల్‌(గజ్వేల్‌): విధులు ముగించుకుని బస్టాండ్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్న దంపతులపై క్రేన్‌ రూపంలో మృత్యువు పంజా విసిరింది. తృటిలో భార్య తప్పించుకోగా, ఆమె కండ్ల ముందరే భర్తను కబళించింది. ఈ విషాదకర ఘటన శుక్రవారం సాయంత్రం గౌరారం శివారులో వర్గల్‌ రోడ్డుపై చోటు చేసుకుంది. గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం వివరాల ప్రకారం..గజ్వేల్‌కు చెందిన గుండ్ల నరేశ్‌(38), నవనీత దంపతులకు పదకొండేళ్లలోపు విఘ్నేశ్‌, అకేశ్‌ ఇద్దరు కుమారులున్నారు. దంపతులు గౌరారం శివారులోని ప్రైవేటు కంపెనీలో కూలీగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగా సాయంత్రం డ్యూటీ ముగించుకుని నరేశ్‌ దంపతులు ఇంటికి నడుచుకుంటూ వర్గల్‌ కమాన్‌ బస్టాప్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున కంపెనీ దాటిన తరువాత వర్గల్‌ నుంచి గౌరారం వైపు అతివేగంగా వస్తున్న క్రేన్‌ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న నరేశ్‌ను వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పక్కనే ఉన్న భార్య నవనీత స్వల్పగాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కండ్ల ముందరే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆమె బోరుమని విలపించింది. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఊహించని ఘటనతో మృతుని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

భార్యకు స్వల్పగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement