ప్రకృతి ఒడి.. ఆరోగ్య సిరి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడి.. ఆరోగ్య సిరి

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

ప్రకృతి ఒడి.. ఆరోగ్య సిరి

జోగిపేట(అందోల్‌): సంప్రదాయంగా జరుపుకునే పండుగలో బతుకమ్మది ప్రత్యేక స్థానం. పువ్వులు, ఆకులు, గౌరమ్మ, పసుపు కుంకుమతో మహిళలు వాటిని క్రమపద్ధతిలో పేరుస్తారు. ప్రకృతి ఒడిలో ఒక్కో చెట్టుకు, తీగకు వికసించిన పూలు అందాన్ని పరిమళాలను వెదజల్లడమే కాక వాటిలో మంచి ఔషధగుణాలు దాగి ఉన్నాయి. తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూలకు ఎంతో గొప్ప విశిష్టత ఉంది. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా కూడా ప్రయోజనాలున్నాయి. నీటిలో ఉన్న మలినాలు ఔషధ గుణాలు కలిగిన పూలతో మటుమాయమై నీటి శుద్ధి జరుగుతుంది. ఆ నీటి స్నానం మంచిది. ఇలా బతుకమ్మ ఆట, పాటలకే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ దోహదపడుతుంది.

తంగేడు..

పల్లె ప్రాంతాల్లో, అడవిలో తంగేడు పువ్వులు సహజ సిద్ధంగా లభిస్తాయి. మొగ్గలు, పువ్వులు, గింజలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మూత్రకోశ వ్యాధులకు, కీళ్ల నొప్పులకు ఈ పువ్వును వినియోగిస్తారు. పూలను తాకడం, వాటి గాలి సోకడం వల్ల చర్మ ఉదర కోశ వ్యాధుల నివారణకు కృషి చేస్తుంది.

గునుగు..

గునుగు పూలు గడ్డి జాతికి చెందిన సహజ వర్ణపూలు. పెద్ద ప్రేగులో బద్దె పురుగులను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ పువ్వులనే అతిసార వ్యాధి నివారణకు మందుగా వాడతారు. కంటి సంబంధ రోగనివారణకు ఉపయోగిస్తారు. ఈ పూలను నీటిలో వేస్తే మలినాలను పీల్చుకొని శుభ్రం చేస్తుంది.

చామంతి

దండగా వేసేందుకు చామంతి పూలను ఉపయోగిస్తారు. దీనితో ఫైరటమ్‌ అనే కీటక నాశక మందులను తయారు చేస్తారు. శరీరానికి చలువ చేయడమే కాకుండా జ్వరం, తాపం, అగ్ని మాంద్యం వంటి వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది.

గుమ్మడి

గుమ్మడి పూలు లేకుండా బతుకమ్మ పేర్చరు. ఇందులో విటమిన్‌ ‘ఏ’ సీ’ అధికంగా అధికంగా ఉండటం ద్వారా కంటి సంబంధ రోగాలకు ఔషధంగా వాడతారు. వృద్ధాప్యంలో తలెత్తే కీళ్ల నొప్పులను తగ్గించే మందులు, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. శరీరంలోని ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది.

మందార

మందార పువ్వులో ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా వెంట్రుకలను నల్లబర్చడానికి తయారు చేసే నూనెలో వీటిని వినియోగిస్తారు. సౌందర్య సాధనాల తయరీలోనూ వాడతారు. అతిసార వ్యాధితో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పువ్వులను ఎండబెట్టి నూనెలో మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి తగ్గి ఉపశమనం ఇస్తుంది.

బంతి..

బంతి పూలను బతుకమ్మలో పేర్చడం తప్పనిసరి. ఈ పువ్వు చలువ చేస్తుంది. ముఖ్యంగా రక్తనాళాలు శుద్ధి చేసి రక్త సరఫరాను మెరుగుపర్చడానికి సరఫరా చేసే ఔషధంలో వీటిని వినియోగిస్తారు. గొంతు సంబంధిత వ్యాధులను నయం చేసే లక్షణం వీటిలో ఉన్నాయి. సుగంధ తైలాలు తయారీ, రక్త స్రావానికి మందుగా ఉపయోగిస్తారు.

తామర..

తామర పువ్వును రక్తస్రావ నివారణకు మందుగా వాడతారు. జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యకరమైన ఔషధంగా.. సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు.

బీర..

ప్రస్తుత సీజన్‌లో బీర పువ్వులు బతుకమ్మలో పేరుస్తారు. చర్మ సంబంధ వ్యాధులకు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. రంగుల యారీలోనూ వినియోగిస్తారు.

గడ్డిపువ్వు

గడ్డి పువ్వును యాంటి వైరల్‌గా వాడతారు. గ్రామీ ణ ప్రాంతాల్లో రక్తస్రావాన్ని తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

దోస

కామెర్ల వ్యాధి నివారణకు దోస పువ్వు ఉపయోగపడుతుంది. రక్తపోటు తక్కువ ఉన్నవారు దీనిని వాడతారు.

బతుకమ్మ పూలల్లోఔషధ గుణాలు

చెరువులో నిమజ్జనంతో నీటి శుద్ధి

తంగేడుతో మధుమేహం అదుపులో

అతిసార వ్యాధి నివారణకు గునుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement