మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
పెద్దశంకరంపేట(మెదక్): మద్యానికి బానిసై కుటుంబీకులతో గొడవపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. పెద్దశంకరంపేటలోని డబుల్బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్న నీలకంఠి దుర్గాప్రసాద్(32) గురువారం రాత్రి మద్యం తాగి వచ్చి అకారణంగా తల్లి, చెల్లితో గొడవపడ్డాడు. అనంతరం తన రూమ్‌లోకి వెళ్లి గడియపెట్టుకొని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు చూడగా చనిపోయి ఉన్నాడు. మద్యానికి బానిసై మనస్తాపానికి గురై చనిపోయినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుడి తల్లి హేమలత ఫిర్యాదు మేరకు ఎస్ఐ.ప్రవీణ్‌రెడ్డి కేసు నమోదు చేశారు.
జీవితంపై విరక్తితో..
వర్గల్(గజ్వేల్): జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని వేలూరులో చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ ఆరోగ్యం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ నయీమ్(34)కు రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఇంట్లోనే ఉంటున్నాడు. మద్యానికి అలవాటుపడి మనోవేదనకు గురవుతున్నాడు. వారం క్రితం అతని భార్య సోదరుడి పెండ్లి ఉందని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన అతడు తన ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని శ్రీనివాస, శ్రీదత్త సాయి మద్యం దుకాణాలను శుక్రవారం రామాయంపేట ఎకై ్సజ్ ఎస్ఐ విక్రమ్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని రికార్డులను పరిశీలించి, మద్యం నిల్వల వివరాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైన్స్ నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతిరోజూ మద్యం నిల్వలకు సంబంధించిన స్టాక్ వివరాలను రికార్డుల్లో క్రమం తప్పకుండా నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎకై ్సజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్: మండి హోటల్లో విషాహారం తిని అస్వస్థతకు గురైన బాధితులు కోలుకుంటున్నారు. పట్టణంలోని వన్ ప్యాలెస్ మండి హోటల్లో ఈనెల 12న మండి బిర్యానీ తిని పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా వారిలో కొందరు ప్రభుత్వ ఏరియాస్పత్రిలో, కొందరు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కాగా శుక్రవారం నాటికి కోలుకున్న వారిని డిశ్చార్జి చేశామని ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఆస్పత్రిలో ఇంకా 21 మంది ఉన్నారని, వారికి తగిన వైద్యం అందిస్తున్నామని ఆయన చెప్పారు.
దుబ్బాకటౌన్: మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రాయపోల్ ఎస్ఐ బి.లింగం కథనం ప్రకారం.. రాయపోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరిని న్యాయస్థానంలో హాజరుపరచారు. న్యాయస్థానం ఒకరికి రెండు రోజులు, మరొకరికి మూడు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయ విద్యాలయంలో 9,11వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే లెటరల్ ఎంట్రీ పరీక్ష కోసం దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రాజేందర్ తె లిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా విద్యార్థు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వట్పల్లి(అందోల్): భవన నిర్మాణ కూలీ విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అందోల్ మండలం డాకూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బ్రహ్మణపల్లి రాములుకు చెందిన ఇంటి నిర్మాణ మొత్తం గుత్తగా వెస్ట్ గోదావరి జిల్లా తాడెపల్లి గూడెంకు చెందిన నాగరాజు అనే కాంట్రాక్టర్ తీసుకున్నాడు. నాగరాజు తన సోదరుడు శేషగిరితో కలిసి కొన్ని రోజులుగా ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటి పనులు చేస్తున్న క్రమంలో ఇంటి పైనుంచి వెళ్లిన విద్యుత్ వైర్లకు శేషగిరిరావు చేతులు తగిలి షాక్‌కు గురై పడిపోయాడు. ఈ క్రమంలో అతడికి కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపాడు.


