జిన్నారం (పటాన్చెరు): పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ కార్మికుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బొల్లారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. సీఐ సుధీర్కుమార్ వివరాల ప్రకారం... బీహార్కు చెందిన అన్సారీ (35) బొల్లారం పారిశ్రామిక వాడలోని శ్రీకృష్ణ స్టీల్ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ప్రమాదవశాత్తు స్టీల్ రాడ్డు తలకు తగిలి కింద పడిపోయాడు. కాగా యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా తీవ్ర గాయాలైన కార్మికుడిని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెరుగైన చికిత్స అందించకపోవడంతోనే కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.


