శివ్వంపేట(నర్సాపూర్): విద్యుత్ కోతల మూలంగా చేతికి వచ్చిన పంటలు ఎండుముఖం పడుతుండటంతో వాటిని కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మండలంలోని చిన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన రైతు మదిరే మల్లేశ్ రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి పంటను సాగు చేస్తున్నాడు. వర్షాలు సరిగా లేకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు పోయకపోవడం, విద్యుత్ కోతల మూలంగా చేతికి వచ్చిన వరిపంట ఎండిపోతుంది. ఈ క్రమంలో శుక్రవారం రైతు ట్యాంకర్ ద్వారా పంటకు నీళ్లు అందించి కాపాడుతున్నాడు.
● ట్యాంకర్ ద్వారా నీరు
● పంటను కాపాడేందుకు రైతు పాట్లు


