నేడు మంత్రి వివేక్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి వివేక్‌ రాక

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

రూ.2కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం

హత్నూర(సంగారెడ్డి): మండలంలోని గుండ్లమాచునూరు గ్రామంలో పరిశ్రమల సహకారంతో రూ.2కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ శుక్రవారం మండలంలో పర్యటించనున్నారు. జిల్లాలోనే ఎక్కడాలేని విధంగా సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా రూ.1.20కోట్లతో చెరువు కట్టపై బతుకమ్మ ఘాట్‌ నిర్మించడంతోపాటు సీసీ రోడ్డు, హైమాక్స్‌ లైట్లు ఏర్పాటు చేశారు. మరో రూ.20 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. వీటిని మంత్రి ప్రారంభించడంతోపాటుగా సీఎస్‌ఆర్‌ నిధులు ద్వారా రూ.50లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఆదర్శ పాఠశాల సుందరీకరణ

గుండ్ల మాచునూర్‌ గ్రామంలో గతంలో ప్రభుత్వం నిర్మించిన ఆదర్శ పాఠశాల అసంపూర్తిగా ఉండటంతో స్థానికంగా కోవలేంట్‌ లేబోరేటరీస్‌ పరిశ్రమ సుమారు రూ.2.50 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో పాఠశాల భవనం పూర్తిగా నిర్మించి విద్యార్థులకు అవసరమైన ల్యాబ్‌లను ఆధునీకరించారు. పాఠశాల ఆవరణలో ఇండోర్‌ ఔట్‌డోర్‌ స్టేడియాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement