పకడ్బందీగా రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా రీ సర్వే

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

జిల్లా సర్వే ల్యాండ్స్‌ అండ్‌ రికార్డ్స్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఐనేశ్‌

వట్‌పల్లి (అందోల్‌): రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా జిల్లా సర్వే ల్యాండ్స్‌ అండ్‌ రికార్డ్స్‌ శాఖ డైరెక్టర్‌ ఐనేశ్‌, తహసీల్దారు మధుకర్‌రెడ్డి పేర్కొన్నారు. అందోల్‌ మండల పరిధిలో గురవారం రీ సర్వే చేపట్టేందుకు కిచ్చన్నపల్లి గ్రామం ఎంపిక కాగా సర్వే అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భూ రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టాలన్నారు. దీని ద్వారా హద్దులు, భూమి స్పష్టత, ప్రభుత్వ భూములను నిర్ధారించడం సులభతరమవుతుందన్నారు. సర్వే సమయంలో భూ యజమానులకు నోటీసులు అందజేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో భూ హక్కుదారులతోపాటు, సరిహద్దు రైతుల సమక్షంలో హక్కులకు నష్టం జరుగకుండా సర్వే చేపట్టాలని సర్వేయర్లకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement