పారదర్శకంగా అర్హుల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా అర్హుల గుర్తింపు

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

పారదర్శకంగా అర్హుల గుర్తింపు డీఎస్పీ రైటర్‌కు ప్రశంసాపత్రం ఏఓ లావణ్యకు జాతీయ పురస్కారం కనీస వేతనం పెంపు జీవోను అమలు చేయాలి

జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి

రాయికోడ్‌(అందోల్‌): చేయూత పింఛన్‌ దరఖాస్తుదారుల అర్హుల గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నట్లు జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని హుస్నాబాద్‌, కర్చల్‌, కోడూర్‌, నల్లంపలి గ్రామాలను గురువారం ఆయన సందర్శించారు. ఆయా గ్రామాల్లోని పలువురు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి ధ్రువపత్రాలను చేయూత యాప్‌ ద్వారా సరిచూశారు. దరఖాస్తుదారుల వివరాలను, వారి ఆర్థిక, వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వివిధ రకాల పింఛన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి మంజూరయ్యేలా ప్రతిపాదిస్తున్నామన్నారు. అర్హత పరిశీలన వివిధ దశల్లో చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఎం.షరీఫ్‌, ఎంపీఓ సంతోశ్‌, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు అశోక్‌రెడ్డి, వసంత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌: ఖేడ్‌ పోలీసు సబ్‌ డివిజన్‌(డీఎస్పీ) కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌కుమార్‌ జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ చేతులమీదుగా గురువారం సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. అంకిత భావంతో బాధ్యతాయుతంగా తనకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వరిస్తున్నందుకుగాను ప్రశంసాపత్రాన్ని అందించారు.

జహీరాబాద్‌ టౌన్‌: వ్యవసాయ రంగంలో అంకితభావంతో సేవలు అందించినందుకుగాను జహీరాబాద్‌ మండల ఏఓ నీరడి లావణ్యకు జాతీయస్థాయి పురస్కారం లభించింది. ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతీ ఏటా జాతీయస్థాయి అవార్డులను కేంద్రం ప్రదానం చేస్తుంది. గురువారం న్యూ ఢిల్లీలో జరిగిన మహిళా కిసాన్‌ దివస్‌ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాతీయ అడిషనల్‌ సెక్రటరీలు మహేందర్‌ కుమార్‌ దివేది, అతీశ్‌చంద్రల చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున లావణ్య అవార్డు అందుకున్నారు.

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల జీవో 6ను జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పెప్సీ పరిశ్రమ నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. దసరాలోపు కార్మికులకు బోనస్‌ చెల్లించడంతోపాటు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం మే 30న కనీస వేతనాలను సవరిస్తూ జీవో 6 విడుదల చేసినప్పటికీ, జిల్లాలోని అనేక పరిశ్రమల్లో కార్మికులకు సవరించిన వేతనాలు అమలు కావడం లేదన్నారు. కనీస వేతనాలను రూ.42 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, జిల్లా ఉపాధ్యక్షుడు బాగారెడ్డి, నాయకులు ప్రసన్నరావు, పరమేశ్వర్‌, రాందాస్‌ పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement