మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
జోగిపేట(అందోల్): అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం, పోలీసుల తీరుకుని నిరసనగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళ ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరును ఆయన పూర్తిగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పి.జైపాల్ రెడ్డి, మాజీ మార్కెట్లో చైర్మన్లు నారాయణ, డీబీ నాగభూషణం, మాజీ ఎంపీపీ బాలయ్య పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అందోల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విద్యార్థినులకు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మద్దతు పలికారు.


