● 31వ వార్డుకు రూ.10 లక్షల నగదు రివార్డు
సంగారెడ్డి: స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో రాష్ట్రస్థాయిలో సంగారెడ్డి మున్సిపాలిటీకి గుర్తింపు లభించడంతోపాటు, 31వ వార్డుకు రూ.10 లక్షల రివార్డు లభించింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ జగ్గరి సతీశ్‌రెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులుండగా 31వ వార్డుకు సంబంధించి 100% డోర్ టూ డోర్ కలెక్షన్, 60% సోర్స్ సెగ్రిగేషన్, వార్డుల్లో గ్రీన్ డెవలప్‌మెంట్, ప్రతీ వీధికి డ్రైనేజ్ క్లీనింగ్ చేపట్టడం వంటి అంశాలకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు సాధించేందుకు సహకరించిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కమిషనర్‌తోపాటు 31 వ వార్డు ప్రజలకు జగ్గారెడ్డి, నిర్మల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, నాయకులు జార్జ్ పాల్గొన్నారు.


