వృద్ధుల పింఛన్‌కు అవకాశమివ్వండి | - | Sakshi
Sakshi News home page

వృద్ధుల పింఛన్‌కు అవకాశమివ్వండి

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

సమన్వయంతో పనిచేయండి

సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి వినతి

హత్నూర (సంగారెడ్డి): వృద్ధులకు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నస్తిపూర్‌ గ్రామానికి చెందిన సామాజిక సేవ కార్యకర్త వెంకట్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రజాభవన్‌లో ప్రజావాణి రాష్ట్ర నోడల్‌ అధికారి విద్యాసాగర్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు చేయకపోవడంతో ఎందరో చేయూత లబ్ధిదారులు ఇబ్బందులు పడుతూ పెన్షన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. వినతిపత్రం తీసుకున్న నోడల్‌ అధికారి విద్యాసాగర్‌ సానుకూలంగా స్పందించి నట్లు తెలిపారు. ఆ వినతి పత్రాన్ని గ్రామాభివృద్ధి శాఖ సీఈఓకు పంపిస్తానని చెప్పినట్లు వివరించారు.

ఆ ఏజెన్సీలను రద్దు చేయండి

మెడికల్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి

యాదగిరి డిమాండ్‌

సంగారెడ్డి: కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలను రద్దు చేయాలని మెడికల్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.యాదగిరి డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాధికారులను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాస్పత్రి ముందు మంగళవారం కార్మికులు ధర్నా చేయడంతోపాటు మోకాళ్లతో నిరసన తెలిపారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మురళీకృష్ణకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, సదానందం,నాగరాజు,రమేశ్‌, రమాదేవి మరియమ్మ, భాగ్యలక్ష్మి, సునీత, మంజుల, రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

వ్యాయామమే

ఆరోగ్యానికి ఔషధం

స్పోర్ట్స్‌ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ సుభాష్‌

రేగోడ్‌(మెదక్‌): ప్రజల్లో ఫిజియోథెరపీ.. వ్యాయామం ప్రాముఖ్యతపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని స్పోర్ట్స్‌ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ పి.సుభాష్‌ తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించవచ్చన్నారు. గుండె వ్యాధు లు, పక్షవాతం, క్రీడా గాయాలు, సర్జరీకి ముందు–తర్వాత రిహాబిలిటేషన్‌లో ఫిజియోథెరపీ కీలకమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫిజియోథెరపీ సేవలపై అవగాహ న మరింత పెరగాలని ఆయన సూచించారు.

తొగుట(దుబ్బాక): ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు సూచించారు. మిరుదొడ్డి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పర్పంచ్‌లు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement