మిగిలింది నియామకమే! | - | Sakshi
Sakshi News home page

మిగిలింది నియామకమే!

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

● గతేడాది అక్టోబర్‌లో డీసీసీ నియామకం ప్రక్రియను మొదటిసారిగా చేపట్టారు. అన్ని నియోజకవర్గాల నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట అప్పట్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి నాయకుల అభిప్రాయాలను సేకరించారు. జిల్లా కు చెందిన అగ్రనేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఒకరు ప్రతిపాదించిన పేరును మరొకరు వ్యతిరేకించారు. దీంతో ఈ డీసీసీ నియామకాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ● తాజాగా అధిష్టానం దీపక్‌రాథోడ్‌ను జిల్లాకు పంపింది. దీపక్‌రాథోడ్‌తోపాటు, ముగ్గురు పీసీసీ సమన్వయ సభ్యులు కలిసి రెండోసారి అభిప్రాయ సేకరణ చేపట్టారు. జిల్లా స్థాయిలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ప్రతీ నియోజకవర్గానికి వెళ్లి క్యాడర్‌ అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఈసారి కూడా ఈ పదవి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ● ఆయా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమావేశాలకు హాజరుకాని ముఖ్యనేతలు కొందరు హైదరాబాద్‌లో దీపక్‌రాథోడ్‌ను కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లి కొందరు కీలక నాయకులు ఈ పదవి విషయంలో తమ అభిప్రాయాలను దీపక్‌రాథోడ్‌తో పంచుకున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇలా నేతలు, క్యాడర్‌ అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ పరిశీలకుడు రాథోడ్‌ రెండు రోజుల క్రితం నివేదికను అధినాయకత్వానికి ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ● ఈ నివేదికను పరిశీలించాక..జిల్లాలోని కీలక నాయకులను ఢిల్లీకి పిలిచి చర్చించిన తర్వాత డీసీసీ నియామకం చేపట్టే అవకాశాలున్నాయని హస్తం పార్టీ నాయకులు భావిస్తున్నారు. అనంతరం డీసీసీపై అధిష్టానం ప్రకటన ఉండవచ్చని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి.

రెండు రోజుల క్రితం అందజేసిన దీపక్‌రాథోడ్‌.. అధినాయకత్వం నిర్ణయంపై ఉత్కంఠ

నివేదించారు..

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు దీపక్‌రాథోడ్‌ ఆ పార్టీ అధినాయకత్వానికి నివేదిక సమర్పించారు. జిల్లాలో క్షేత్రస్థాయిలోని క్యాడర్‌ అభిప్రాయం, ద్వితీయశ్రేణి నాయకుల మనోభావాలు, జిల్లా అగ్రనేతల సూచనలను తీసుకున్న దీపక్‌రాథోడ్‌ ఈ మేరకు రెండు రోజుల క్రితం నివేదికను ఆ పార్టీ అధినాయకత్వానికి అందజేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అధిష్టానం ఈ పదవిని ఎవరికి ఫైనల్‌ చేస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఈ పదవి ఆశిస్తున్న నాయకులు అధిష్టానం ఎవరికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా అని వేచి చూస్తున్నారు. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

వరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైన అధికార కాంగ్రెస్‌ పార్టీలో డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రధానంగా జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు తమ అనుచరులకు ఈ పదవిని ఇప్పించుకునేందు కు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఐదు నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షుల ని యామకం జరిగి ఏడాదిన్నర దాటినప్పటికీ సంగారెడ్డి డీసీసీ నియామకం మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. సంగారెడ్డితోపాటు, రంగారెడ్డి, రామగుండం సిటీ డీసీసీలు పెండింగ్‌లో ఉండిపోయాయి.

డీసీసీపై అధిష్టానానికి నివేదిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement