ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నారాయణఖేడ్: రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పాత్ర తెలంగాణ రక్షణ సేన పార్టీ (టీఆర్‌ఎస్)నే పోషిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నారాయణఖేడ్‌కు సోమవారం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ స్థాపించి 120 రోజులు అయిందని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ రేవంత్ సర్కార్‌కు వంద చెరువుల నీళ్లు తాగించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయినప్పటికీ ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపించారు. తమ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అన్నివర్గాల సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. యువతతో పాటు నిరుద్యోగులు, దివ్యాంగులు, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల కోసం తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ఖేడ్‌లో మూడు కుటుంబాల పాలన సాగుతుందని, మార్పు కోసం ప్రజలు సహకరించాలని కోరారు.


