ప్రైవేట్‌ డాక్టర్ల వైద్యంపై విచారణకు ఆదేశం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ డాక్టర్ల వైద్యంపై విచారణకు ఆదేశం

Aug 29 2026 7:15 AM | Updated on Aug 29 2026 7:15 AM

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ ఏరియా ప్రభుత్వాస్పత్రిలో డ్యూటీ డాక్టర్లు గురువారం గైర్హాజరు కాగా వారి స్థానంలో ఓ ప్రైవేట్‌ డాక్టర్‌తో రోగులకు వైద్యం చేయిస్తున్న తీరుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై స్పందించిన ఆయన శుక్రవారం ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ, కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో ఫోన్లో మాట్లాడారు. జహీరాబాద్‌ దవాఖానలో వైద్యుల కొరతతోపాటు, విధుల్లో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యులు గైర్హాజరై, ప్రైవేట్‌ వ్యక్తులతో చికిత్సలు చేయిస్తున్నారన్న వ్యవహారం కలకలం రేపింది. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించిన మంత్రి, డ్యూటీకి డుమ్మా కొట్టిన బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

డాక్టర్‌కు మెమో జారీ

మంత్రి దామోదర ఆదేశాలతో జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌, తహసీల్దార్‌ దశరథ్‌తోపాటు ఇతర అధికారులు శుక్రవారం రాత్రి ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించగా..డ్యూటీ డాక్టర్‌ స్థానంలో ప్రైవేట్‌ డాక్టర్‌ విధులు నిర్వహించిన విషయంపై సమగ్ర విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా డాక్టర్‌ భవన విధులకు గైర్హాజరైనట్లు నిర్ధారణ కావడంతో ఆమెకు మెమో జారీ చేశారు.

దవాఖానలో ‘డ్యూటీ’దగా వార్తకు స్పందించిన మంత్రి దామోదర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement