అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా అందించే కొత్త పెన్షన్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో చేయూత పథకానికి సంబంధించిన కరపత్రాలు, బ్యానర్, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రక్త సంబంధిత దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ౖపైలేరియా బాధితులకు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్లను అందిస్తోందన్నారు. కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్న వారు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి, అదనపు డీఆర్డీఓ సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.
చేగుంట(తూప్రాన్): బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యు రాలిగా చేగుంటకు చెందిన సోమ స్వాతిని నియ మిస్తూ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ శుక్రవారం నియామకపత్రం అందించారు. తనకు జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించిన ఎంపీ రఘునందన్‌రావు, నియోజకవర్గ నాయకులకు స్వాతి కృతజ్ఞతలు తెలిపారు.


