నర్సాపూర్: పర్యావరణ పరిరక్షణలకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అర్బన్‌పార్కు ఆవరణలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున మొక్కలు నాటి వాటిని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి దివ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెశ్‌యాదవ్, డిప్యూటీ రేంజ్ అధికారి సిద్దిరాంసింగ్, సెక్షన్ ఆఫీసర్లు సాయిరాం, కలీమోద్దీన్, రాజమణిలతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


