దసరాకి రణబాలి ఫిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

దసరాకి రణబాలి ఫిక్స్‌

Aug 28 2026 7:21 AM | Updated on Aug 28 2026 7:21 AM

దసరాకి రణబాలి ఫిక్స్‌

విజయ దశమి సందర్భంగా థియేటర్స్‌లోకి రానున్నాడు రణబాలి. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’. ఈ చిత్రంలో రణ బాలిగా విజయ్‌ దేవరకొండ, జయమ్మగా రష్మికా మందన్నా, సర్‌ థియోడర్‌ హెక్టర్‌ పాత్రలో ఆర్నాల్డ్‌ వోస్లూ నటిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన కొన్ని చారిత్రక వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న ఈ సినిమాకు రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌ సమర్పణలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను సెప్టెంబరు 11న రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తాజాగా ‘రణబాలి’ని విజయదశమి సందర్భంగా అక్టోబరు 16న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement