కాపర్‌ దొంగల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కాపర్‌ దొంగల అరెస్టు

Aug 28 2026 7:21 AM | Updated on Aug 28 2026 7:21 AM

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): కాపర్‌, అల్యూమినియం చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని వెంకటేశ్వపల్లి, ఆరెపల్లి, బస్వాపూర్‌ గ్రామాల శివారులోని ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్‌, అల్యూమినియం వైర్లతో పాటు పొలాల వద్ద మోటార్‌ వైర్లను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు దరాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌ జిల్లా సోమారం గ్రామానికి చెందిన లోకిని మహేశ్‌, హన్మకొండ జిల్లా గోకుల్‌నగర్‌కు చెందిన దేవర రాజశేఖర్‌ అపహరించిన వైర్లను ఆటోలో తీసుకొస్తుండగా సముద్రాల గ్రామం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మోటార్‌ స్టార్టర్‌ వైర్‌, 10కిలోల ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ వైర్‌, 100కిలోల అల్యూమినియం వైర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన పోలీసులు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement