నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపల్ మెప్మా విభాగాన్ని జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.ఏ. అలీమ్, డీఎంసీ మల్లేశ్వరి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మెప్మా టీఎంసీ అనిత, ఆర్పీలతో కలిసి వీధి వ్యాపారులు, బ్యాంకు లింకేజీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మెప్మా ద్వారా మహిళా సంఘాలు, పట్టణ పేదల ఆర్థిక అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు రుణాల మంజూరు, గ్రూపుల పనితీరు, వీధి వ్యాపారులకు అందుతున్న సహాయంపై వివరాలను పరిశీలించారు. అనంతరం ఆక్సిజన్ పార్క్‌లోని బృందావన్ క్యాంటీన్‌ను సందర్శించి నిర్వహణ, మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
తెగిన విద్యుత్ వైర్
స్పందించని అధికారులు
శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని గురువారం రైతులు వాపోయారు. మండల పరిధిలోని సామ్య తండా సమీపంలోని వ్యవసాయ బోరుబావులకు కరెంటు సరఫరా చేసే వైరు నుంచి నిప్పురవ్వలు వస్తున్న విషయాన్ని మూడు రోజుల నుంచి సదరు లైన్‌మెన్‌కి చెప్పినా స్పందన లేదని రైతులు గుండునాయక్, రాజు, చందర్, విశాంత్, రవినాయక్ ఆరోపించారు. గురువారం ఆ వైర్ తెగి వ్యవసాయ పొలాల్లో పడిందని, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని వాపోయారు.


