పది, ఇంటర్, తదితర మార్కుల జాబితా
కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రం
ఆధార్ కార్డు
విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
మొబైల్ నంబర్
● దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 7 ● రెగ్యులర్ డిగ్రీతో సమానం ● జిల్లాలో 7 అధ్యయన కేంద్రాలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్ /సంగారెడ్డి క్రైమ్: ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల కొందరు ఉన్నత చదువులకు దూరం అవుతుంటారు. మరికొందరు రెగ్యులర్ తరగతులకు వెళ్లలేక మానేస్తారు. అలాంటి (చదువు మధ్యలో ఆపేసిన) వారికి చదువుకోవడానికి ప్రభుత్వం చక్కటి అవకాశం కల్పిస్తోంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన వారు రెగ్యులర్ డిగ్రీ పూర్తి చేసిన వారితో సమానం. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కింది స్థాయి ఉద్యోగులు అంబేడ్కర్ డిగ్రీ పట్టాతో పదోన్నతులు సైతం పొందవచ్చు.
అందుబాటుల్లో 7 సెంటర్లు
జిల్లాలో ప్రస్తుతం సంగారెడ్డి, జోగిపేట్, పటాన్‌చెరు, జహీరాబాద్, ఆత్మకూర్ సదాశివపేట్, నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దూరవిద్య సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బోధిస్తున్నారు. ఇంటర్ సమాన విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సులు ఎంచుకొని మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేయవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇచ్చే సర్టిఫికెట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉంది. ఎలాంటి ఉద్యోగానికై నా అర్హులే. ఆసక్తి ఉన్న పలువురు ఈ యూనివర్సిటీలో ద్వారా డిగ్రీ పూర్తి చేసి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అభ్యాసకులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేలా ప్రభుత్వం నెలకు ఐదు తరగతులు అంటే ప్రతి ఆదివారంతో పాటు రెండో శనివారం క్లాసులు నిర్వహిస్తుంది. ఇలా ఏడాదికి కనీసం 30 క్లాసులు నిర్వహిస్తారు.
జత చేయాల్సిన ధ్రువపత్రాలు
దరఖాస్తు విధానం ఇలా..
2026–2027 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు ప్రక్రియ మొదలైంది. ఫీజు ఏడాదికి రూ.3400 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. పరీక్ష ఫీజు ప్రతి సబ్జెక్టు పేపర్‌కు అదనంగా చెల్లించాలి. దరఖాస్తుకు జత చేసి పత్రాలను సెంటర్‌లో ఇవ్వాలి. బుక్స్ కోసం రూ.500 చెల్లిస్తే పోస్టు ద్వారా ఇంటికి వస్తాయి. వచ్చే నెల ఆగస్టు 7 తేదీ వరకు అవకాశం ఉంది. వివరాలకు హెల్ప్‌డెస్క్ నంబర్ 1800 599 0101, 73829 29570, 040–23680 222ను సంప్రదించాలి.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు
రెగ్యులర్ డిగ్రీతో సమానం
చదువు మధ్యలో ఆపేసిన వారికి అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వరం లాంటిది. మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. అంబేడ్కర్ డిగ్రీ రెగ్యులర్ డిగ్రీతో సమానం. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు రాయడానికి అర్హులు.
– రమేశ్ బాబు, అంబేడ్కర్ సెంటర్ కోఆర్డినేటర్, సంగారెడ్డి.


