పొలం గట్టు పైనుంచి జారిపడి.. | - | Sakshi
Sakshi News home page

పొలం గట్టు పైనుంచి జారిపడి..

Jul 8 2026 9:38 AM | Updated on Jul 8 2026 9:38 AM

రైతు మృతి

రైతు మృతి

వెల్దుర్తి(తూప్రాన్‌): పొలం గట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడటంతో యువరైతు మృతి చెందా డు. ఈ విషాదకర ఘటన మండలంలోని శేరీల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన శంకురు శేఖులు (35) సోమవారం ఉదయం తన వ్యవసాయ పొలంతో పాటు కౌలుకు తీసుకున్న పొలాన్ని నాటుకు సిద్ధం చేయడానికి సొంత ట్రాక్టర్‌తో దున్నుతున్నాడు. కాగా డీజిల్‌ అయిపోవడంతో సాయంత్రం ఇంటికి వచ్చి క్యాన్‌లో తీసుకొని వచ్చాడు. ఈ క్రమంలో పొలం గట్టు పైనుంచి వెళ్తుండగా జారి బురదలో బోర్లాపడటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెతుకుతుండగా పొలంలోనే మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య విజయ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement