10 కిలోల కల్తీ టీ పౌడర్‌ సీజ్‌.. | - | Sakshi
Sakshi News home page

10 కిలోల కల్తీ టీ పౌడర్‌ సీజ్‌..

Jul 8 2026 9:38 AM | Updated on Jul 8 2026 9:38 AM

హుస్నాబాద్‌రూరల్‌: పదికిలోల కల్తీ టీ పౌడర్‌ను అధికారులు సీజ్‌ చేశారు.వివరాలు ఇలా... హుస్నాబాద్‌ పట్టణంలోని దుకాణదారులు మహారాష్ట్ర నుంచి ఎలాంటి అనుమతులు లేని టీ పౌడర్‌ తెచ్చి ఎక్కువ డబ్బులకు ప్రజలకు అమ్ముతున్నారు. కాగా దీనిపై బీజేపీ నాయకుడు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ జయరాం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కల్తీ టీ పౌడర్‌ అమ్మిన రాధిక కిరాణంలో తనిఖీలు చేపట్టి 10 కిలోలను సీజ్‌ చేసి ల్యాబ్‌కు పంపించారు. టీ పౌడర్‌ నాణ్యతపై ల్యాబ్‌లో పరీక్షించి రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement