పుట్టిన రోజు వేడుకకు వెళ్తూ అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజు వేడుకకు వెళ్తూ అనంతలోకాలకు..

Jul 8 2026 9:38 AM | Updated on Jul 8 2026 9:38 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చేర్యాల(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధి లోని కడవేర్గు శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి భార్య కథనం ప్రకారం... కొండపాక మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన తలపాక కిష్టయ్య(45) తన భార్య పూజితతో కలిసి మండలంలోని నాగపు రి గ్రామంలో జరిగే బంధువుల పుట్టినరోజు వేడుకకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కడవేర్గు శివారులో పెట్రోల్‌ బంక్‌ సమీపంలోకి వెళ్లగానే వర్షం రావడంతో కిష్టయ్య బైక్‌ను ఆపగా భార్య దిగి పక్కన నిలబడింది. అంతలోనే వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం కిష్టయ్య బైక్‌ను ఢీకొట్టింది. రోడ్డుపై పడిన కిష్టయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

117సెల్‌ఫోన్లు

బాధితులకు అప్పగింత

సిద్దిపేటకమాన్‌: పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను నూతన టెక్నాలజీ సాయంతో గుర్తించి బాధితులకు అందించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. మంగళవారం సిద్దిపేట పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో రికవరీ చేసిన సెల్‌ఫోన్లను బాధితులకు అందజేసి ఆమె మాట్లాడారు. కమిషనరేట్‌ పరిధిలో కొంత కాలంగా కొంత మంది తమ సెల్‌ఫోన్లను పోగొట్టుకు బాధితులు సంబంధిత పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను నూతన టెక్నాలజీ సీఈఐఆర్‌ యాప్‌ ద్వారా రూ.12 లక్షల విలువైన 117 సెల్‌ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఫోన్లను రికవరీ చేసిన పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ కుశాల్కర్‌, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, నర్సింహులు, సదానందం, సీఐలు మహేందర్‌రెడ్డి, మురళి, విద్యాసాగర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చెక్‌బౌన్స్‌ కేసులో

నిందితునికి శిక్ష

గజ్వేల్‌: చెక్‌బౌన్స్‌ కేసులో నిందితునికి జరిమానా విధిస్తూ గజ్వేల్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా... ఫిర్యాదుదారుడు కే.విశ్వనాథం వేసిన చెక్‌బౌన్స్‌ కేసులో విచారణ అనంతరం నిందితుడు బల్లా శ్రీనివాస్‌కు రూ.1000 జరిమానాతోపాటు ఫిర్యాదుదారుకు రూ. లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పును వెలువరించింది.

తాను చనిపోతూ

ఆరుగురికి అవయవదానం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): తాను చనిపోతూ ఆరుగురికి అవయవదానం చేశాడు. వివరాలిలా.. మెదక్‌ జిల్లా హవేళిఘణాపూర్‌ మండలం సర్దన గ్రామానికి చెందిన లోకినేని రఘు త్రివేండ్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా గత నెల 29న కుమారుడు యాశ్వన్‌(7) రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై కోమాల్లోకి వెళ్లాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చి కిడ్నీలు, కళ్లు, కాలేయం, గుండెను దానం చేసి ఆరుగురికి ప్రాణం పోశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement