సాంకేతిక పరిజ్ఞానం అవసరం | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానం అవసరం

Jul 8 2026 9:38 AM | Updated on Jul 8 2026 9:38 AM

ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయ

వీసీ రాజిరెడ్డి

ములుగు(గజ్వేల్‌): విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ములుగు కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్‌.రాజిరెడ్డి అన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కలాం, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ పి.రాఘవరెడ్డితో కలిసి పీజీ విద్యార్థులతో పరస్పర చర్చ, సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పరిశోధనలు, ప్రయోగశాలలకే పరిమితం కాకుండా, మార్కెటింగ్‌, విలువ ఆధారిత ప్రాసెసింగ్‌, వ్యవసాయ వ్యాపార అవకాశాలు, మార్కెట్‌ అనుసంధానం వంటి రంగాలకు విస్తరించాలని సూచించారు. భూసార, సహజ వనరుల సంరక్షణ, శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతుల అమలుపై రైతులకు అవగాహన కల్పించాలని మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్‌కలాం పేర్కొన్నారు. ఉద్యాన రంగంలో ఆదాయ వనరులను విస్తరించే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని మాజీ వీసీ రాఘవరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement