మెదక్ కలెక్టరేట్: జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తూ , నిర్మూలనకు విస్తృతంగా కృషి చేయాలని తెలంగాణ ఎకై ్సజ్, ప్రొహిబిషన్ శాఖ అధికారులకు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్‌లో ఎకై ్సజ్ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నియంత్రణపై పాఠశాలలు ,కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు, 5 బార్లు ఉన్నట్లు తెలిపారు. వీటి ద్వారా 2024–2025 సంవత్సరానికి రూ.574.08 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. 2025 సంవత్సరంలో రూ.410. 44 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ అధికారులు నాగేశ్వరరావు, నరేందర్, సలాం ముస్తఫా, మాన్‌సింగ్, రాజేశ్, రామచందర్, ఖాజా అహ్మద్, అరుణ, విజయ్ సిద్ధార్థ, హరీశ్ పాల్గొన్నారు.


