ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

Jul 1 2026 5:08 AM | Updated on Jul 1 2026 5:08 AM

వట్‌పల్లి(అందోల్‌): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని తెలంగాణ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మఠం భిక్షపతి పిలుపునిచ్చారు. ఆందోల్‌ మండలం సంగుపేటలోని మంగళవారం జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ...గ్రామాలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాక్షించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, భక్తి మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఆలయాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ఉదయ్‌ బాబుమోహన్‌, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఖాదిరాబాద్‌ రమేశ్‌, సర్పంచ్‌ రామచంద్రారెడ్డి, నాయకులు రవీందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌

మఠం భిక్షపతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement