జీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలి

Jul 1 2026 5:08 AM | Updated on Jul 1 2026 5:08 AM

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట

సీఐటీయూ ధర్నా

నారాయణఖేడ్‌: కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నుంచి ఐదు నెలల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఖేడ్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.నర్సింహులు మాట్లాడుతూ...ఖేడ్‌ పరిధిలోని పంచాయతీ కార్మికులకు ఐదు నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో వారి కుటుంబం గడవడం కష్టంగా మారిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని, రెండు ఫొటోలు తీయాలనే నిబంధనలు తీసుకు రావడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపల్‌ కార్మికులకు రూ.26వేల కనీస వేతనంగా చెల్లించాలని, ప్రతీనెల సబ్బులు, సర్ఫ్‌, పీఎఫ్‌ డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి రమేశ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement