మిడ్‌ డే మీల్స్‌ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మిడ్‌ డే మీల్స్‌ అమలు చేయాలి

Jul 1 2026 5:08 AM | Updated on Jul 1 2026 5:08 AM

నారాయణఖేడ్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఉమ్మడి మెదక్‌ జిల్లా కార్యదర్శి తెంకటి కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఖేడ్‌ కళాశాలను మంగళవారం సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇదే హామీనిచ్చి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఈ పథకాన్ని అమలుచేయలేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సంఘం డివిజన్‌ బాధ్యులు రవి, సుందర్‌, ప్రవీణ్‌, స్టాలిన్‌, సుభాష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement