అనుమతి లేని వెంచర్‌పై చర్యలు | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేని వెంచర్‌పై చర్యలు

Jul 1 2026 5:02 AM | Updated on Jul 1 2026 5:02 AM

కొండాపూర్‌(సంగారెడ్డి): అనుమతి లేని వెంచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని మల్కాపూర్‌లో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్‌ను పరిశీలించి రెండోసారి నోటీసును అందజేశారు. గతంలో మొదటి నోటీస్‌ ఇచ్చినప్పటికీ వెంచర్‌ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. తక్షణమే వెంచర్‌ ముందు భాగంలో నిర్మించిన గేట్‌ను కూల్చాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. వెంచర్‌ ఏర్పాటు చేయాలనుకుంటే నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకోవాలన్నారు. వెంచర్‌లో ప్లాటు కొనే వారు సైతం పర్మిషన్‌ ఉంటేనే కొనుగోలు చేయాలని, అనుమతులు లేని వెంచర్‌లో స్థలం కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని, మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.

మల్కాపూర్‌లో డీపీఓ పర్యటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement