2న అండర్‌–19 క్రికెట్‌ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

2న అండర్‌–19 క్రికెట్‌ జట్టు ఎంపిక

Jul 1 2026 5:02 AM | Updated on Jul 1 2026 5:02 AM

సంగారెడ్డి క్రైమ్‌: హెచ్‌సీఏ ఉమ్మడి మెదక్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా జట్టుకు అండర్‌–19 క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 2న నిర్వహించనున్నారు. ఉమ్మడి కార్యదర్శి రాజేందర్‌ మాట్లాడుతూ.. గురువారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెస్‌ క్రికెట్‌ మైదానంలో సెలక్షన్స్‌ జరుగుతున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సెలక్షన్స్‌ మొదలవుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, క్రికెట్‌ కిట్టుతో హాజరుకావాలని సూచించారు.

డీబీఎఫ్‌ జిల్లా ప్రధాన

కార్యదర్శిగా శేఖర్‌

దుబ్బాకటౌన్‌: డీబీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భీమ్‌ శేఖర్‌ ఎన్నికైనట్లు జాతీయ కార్యదర్శి శంకర్‌ తెలిపారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండల కేంద్రంలో దళిత బహుజన ఫ్రంట్‌ 11వ మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంకర్‌, రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌ హాజరయ్యారు. అనతంరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన భీమ్‌ శేఖర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఏడుగురికి జైలు

పటాన్‌చెరు టౌన్‌: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా, జైలు శిక్ష విధించింది. పటాన్‌చెరు ట్రాఫిక్‌ సీఐ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం, సోమవారం నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో 20 మంది వాహన దారులను పట్టుకున్నారు. వీరిని మంగళవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా రూ.22 వేల జరిమానాతో పాటు అందులో ఏడుగురికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.

చోరీ కేసులో..

జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం డివిజన్‌ పరిధిలో రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన నిందితుడికి జిన్నారం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి పి.తేజశ్రీ నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు నడికుడి శ్రీకాంత్‌ గతంలో కూడా పలు ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడి జైలుకెళ్లాడు. కాగా ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించిన ఎస్‌ఐ పి.కిష్టారెడ్డి, కోర్టు డ్యూటీ అధికారి సీహెచ్‌.అశోక్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు లతీఫ్‌ ఉర్‌ రహమాన్‌, రాఘవేంద్ర కీలకంగా కృషి చేసినట్లు బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ తెలిపారు.

బైక్‌ చోరీ నిందితుడి అరెస్ట్‌

జిన్నారం (పటాన్‌చెరు): వరుసగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన వ్యక్తిని గుమ్మడిదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఎస్సై అరుణ్‌ కుమార్‌ గౌడ్‌ కేసు వివరాలు వెల్లడించారు. గుమ్మడిదల టోల్‌ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నర్సాపూర్‌ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన రాళ్లబండి మాణిక్య చారి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గుమ్మడిదల, నర్సాపూర్‌, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఐదు ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించాడు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసి, పోలీసులు కేసు నమోదు చేశారు.

కల్లు దుకాణం

వివాదంపై విచారణ

హత్నూర (సంగారెడ్డి): కల్లు దుకాణంపై ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ చేశారు. మండలంలోని బోరుపట్ల గ్రామంలోని కల్లు దుకాణం, పాఠశాలకు సమీపంలో ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా మంగళవారం డీఎల్‌పీఓ అనిత, ఎకై ్సజ్‌ జోగిపేట సీఐ సాగర్‌ రెడ్డి, ఎంఈఓ వెంకట్‌ నరసింహ గౌడ్‌, ఎంపీఈఓ యూసుఫ్‌తో పాటు పలు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. విచారణ చేసిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని డీఎల్‌పీఓ తెలిపారు. సర్పంచ్‌ గంగారెడ్డి, ఉప సర్పంచ్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement