ఫీజు బకాయిలను చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజు బకాయిలను చెల్లించాలి

Jul 1 2026 5:02 AM | Updated on Jul 1 2026 5:02 AM

సంగారెడ్డి: విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం విద్యార్థులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ప్రభూ గౌడ్‌ మాట్లాడుతూ... తక్షణమే ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడిన రూ.8వేల కోట్ల ఫీజులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాలేజీలు విద్యార్థుల ఫీజు బకాయిలు ఉండటంతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీని వల్ల ఉద్యోగ అవకాశాలు చేజారి పోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ, కార్యదర్శి శేఖర్‌, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్‌ పాటిల్‌, ఉపాధ్యక్షులు శ్రీధర్‌ మహేంద్ర, అధికార ప్రతినిధి సాయిలు, కోశాధికారి కె.సుధాకర్‌ గౌడ్‌, సలహాదారులు కరణ్‌, కార్యదర్శులు శ్రీనివాస్‌, ప్రవీణ్‌, గౌలిశ్వర్‌, విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాయి భాష, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు లత, అధికార ప్రతినిధి మంగ గౌడ్‌, కార్యదర్శి వీరమని, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అనూప్‌ ముదిరాజ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘంఆధ్వర్యంలో ర్యాలీ

విద్యార్థులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement