నారాయణఖేడ్: పాముకాటుకు గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. గంగాపూర్ గ్రామానికి చెందిన ఉప్పరి నారాయణ(40) సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటువేసింది. గమనించిన కుటుంబీకులు ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయాడు.
జీవితంపై విరక్తి..గృహిణి బలవన్మరణం
వర్గల్(గజ్వేల్): అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెంది గృహిణి బలవన్మరణం చెందింది. ఈ ఘటన మంగళవారం మండలంలోని వేలూరులో చోటు చేసుకుంది. గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీర్ల భాగ్యమ్మ(48)కు భర్త జంగయ్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అందరి వివాహాలు అయ్యాయి. కాగా కొంత కాలం నుంచి ఆమె నరాల వ్యాధితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చూపించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
లైంగికదాడి కేసులో రిమాండ్
పటాన్‌చెరు టౌన్: లైంగికదాడికి పాల్పడిన నిందితున్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పటాన్‌చెరు పోలీసుల కథనం ప్రకారం... 2025లో నిందితుడికి వరుసకు మరదలు అయ్యే మహిళను, ఆమె భర్త గురించి అసత్య ప్రచారం చేశాడు. అలాగే నమ్మించి, బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడని రామచంద్రపురానికి చెందిన గుడపాటి పాండురంగారావుపై జూన్ 6న బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించి నిందితుడిని మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించింది.


