కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు పంటమార్పిడి చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంతర్‌రెడ్డి నిర్వహించిన రైతుభరోసా వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని కౌడిపల్లి రైతువేదికలో అదనపు కలెక్టర్ నగేశ్ వ్యవసాయ అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వానాకాలం పంటలకు సంబంధించి మొదటి విడతగా జిల్లాలో 2.66లక్షల మంది రైతుల ఖాతాల్లో లక్షల రైతు భరోసా నిధులు సీఎం జమ చేశారని చెప్పారు. జిల్లాలో రైతులు ఎక్కువగా వరి పంటను సాగు చేస్తున్నారని, పంటమార్పిడి చేయాలన్నారు. ఆయిల్‌పాం సాగుతో అధిక ఆదాయం వస్తుందని తెలిపారు. మూడున్నరేళ్ల నుంచి ముప్పై ఏళ్లవరకు పంట దిగుబడి వస్తుందని చెప్పారు. జొన్న, మొక్కజొన్న, కందులు, కూరగాయల పంటలు సాగుచేయాలన్నారు. అనంతరం విత్తనమేళా సందర్భంగా పలువురు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఏడీఏ పుణ్యవతి, సర్పంచ్‌లు చంద్రం కృష్ణగౌడ్, ప్రవీణ్ రెడ్డి, రమేశ్, ఏఓ స్వప్న, శ్వేత, ఏఈఓలు సాహితి, స్నేహ, నరేందర్, రైతులు పాల్గొన్నారు.
అదనపు
కలెక్టర్ నగేశ్


