అడ్డుకున్న గ్రామస్తులు
రేగోడ్(మెదక్): మైనింగ్ లారీలను తిరగనివ్వమని, విచారణ చేయాలని గ్రామస్తులు పలుగు రాయితో వెళ్తున్న లారీని అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపూర్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. అధిక లోడ్‌తో పలుగు రాయితో లారీలు వెళ్లడం వల్ల రోడ్లు, దుమ్ము, ధూళితో పంటలు పాడవుతున్నాయని తెలిపారు. తిమ్మాపూర్ గుట్టపై తెల్ల పలుగు రాయి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారని తెలిపారు. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా అనుమతులు ఉన్నాయని, నిబంధనల ప్రకారమే పలుగు రాయిని తరలిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు.


