పాముకాటుతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Jun 30 2026 6:55 AM | Updated on Jun 30 2026 6:55 AM

హత్నూర(సంగారెడ్డి): పాము కాటు వేయడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... తెల్లరాళ్ల తండాకు చెందిన మాదావత్‌ కవిత (38) తన వ్యవసాయ పొలంలో వరితూకం వద్ద పనిచేస్తుండగా ఒక్కసారిగా పాము కాటు వేసింది. దీంతో వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్తతోపాటు పిల్లలున్నారు. వ్యవసాయ పనులు చేసుకొనే కుటుంబంలో పాముకాటుతో మహిళ మృతి చెందడంతో ఆమె పిల్లల పరిస్థితి ఏంటని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యక్తి బైండోవర్‌

మద్దూరు(హుస్నాబాద్‌): మండలంలోని గాగ్గిళ్లాపూర్‌ గ్రామానికి చెందిన సంకోజు శ్రీశైలంను తహసీల్దార్‌ ఏజీ రహీం ఎదుట పోలీసులు బైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఆసీఫ్‌ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వాట్సాప్‌లలో పోస్టులు పెడు తూ గ్రామంలో ప్రజా ప్రశాంతతకు విఘాతం కల్పిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో మంచి ప్రవర్తన కల్గి ఉండాలని ,ప్రజా ప్రశాంతతకు భంగం కల్గించే చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు బైండోవర్‌ చేసినట్లు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement