నాలుగు మోటార్లు చోరీ | - | Sakshi
Sakshi News home page

నాలుగు మోటార్లు చోరీ

Jun 30 2026 6:55 AM | Updated on Jun 30 2026 6:55 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): వ్యవసాయ బావుల వద్ద ఉన్న మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండల పరిధిలోని దొంతిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన రైతులు దశరఽథ్‌రెడ్డి, యాదగిరి, నర్సింహులు, సత్యనారాయణకు సంబంధించి వారి వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన 5 హెచ్‌పీ మోటార్లను దుండగులు అపహరించారు. ఖరీఫ్‌ పనులు ప్రారంభ దశలో నీటి అవసరం ఉండగా మోటార్ల చోరీతో సాగుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. కాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆరెగూడెంలో రెండిళ్లలో..

వెల్దుర్తి(తూప్రాన్‌): ఇంట్లో దొంగలు పడి నగదు, వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి భాగ్య ఇంట్లో రూ.10 వేలు నగదు, 5 తులాల వెండి, మాసం బంగారు ముక్కెర, ఏర్పుల నవీన్‌ ఇంట్లో బంగారు పుస్తె, వెండి కడియాలు, వెండి గాజులు, పట్టగొలుసులను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement