పర్యవేక్షించిన స్టేట్ హెల్త్ జాయింట్ డైరెక్టర్
హవేళిఘణాపూర్(మెదక్): పలు మండలాల పరిధిలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం హెల్త్ స్టేట్ జాయింట్ డైరెక్టర్ అరుణ్ పర్యవేక్షించి వివరాలు తెలుసుకున్నారు. హవేళిఘణాపూర్ మండలంలోని కూచన్‌పల్లి, మెదక్ మండలంలోని రాజ్‌పల్లి, మెదక్ పట్టణంలో పల్స్‌పోలియో కేంద్రాలను ఆయన సందర్శించారు. ఎంత మంది సిబ్బందిని నియమించారు? ఎంత మందికి చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేశారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందనే విషయాన్ని వైద్యాధికారులు, సిబ్బందిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సర్ధన పీహెచ్‌సీ డాక్టర్ వినయ్‌సుశీల్, కృష్ణ, సిద్దిరాములు, రమేశ్ ఉన్నారు.


