జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
మర్కూక్(గజ్వేల్): పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కాశిరెడ్డిపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి ఆమె హాజరై మాట్లాడారు. మహిళా సాధికారతకు సీఎం పెద్దపీట వేశారన్నారు. మహిళల చేతుల్లోనే కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని, ప్రభుత్వ పథకాలు వారి పేరు మీదనే అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు భాస్కర్, నర్సింహులు, ఆత్మ కమిటీ ములుగు డివిజన్ చైర్మన్ కనకయ్య, డైరెక్టర్ వెంకటేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


