యోగా ఇన్‌స్ట్రక్టర్స్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సురేశ్‌ | - | Sakshi
Sakshi News home page

యోగా ఇన్‌స్ట్రక్టర్స్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సురేశ్‌

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

సిద్దిపేటరూరల్‌: హైదరాబాదు నేతాజీ స్కూల్‌ వారాసిగూడలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఆయుష్‌ యోగా ఇన్‌స్ట్రక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర స్థాయి సమావేశంలో సిద్దిపేట జిల్లాకు చెందిన పల్లె సురేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన చిన్నగుండవెల్లి కేంద్రంలో ఆయుష్‌ యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సురేశ్‌ ఎన్నికపై జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట అశోక్‌, వ్యాస మహర్షి యోగా సొసైటీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, భారత స్వాభిమాన్‌ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి రాములు, పతంజలి యోగా సమితి చీఫ్‌ పాటర్న్‌ అంజయ్య, యోగా అసోసియేషన్‌ బృందం సతీశ్‌, సంధ్య, ప్రభాకర్‌, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement