నారాయణఖేడ్: రైతులు వ్యవసాయ పనులను సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి, పంటలు బాగుండాలని కోరుకుంటారు. అయితే వ్యవసాయ పనుల కోసం పశుసంపదను సన్నద్ధం చేయడంలో భాగంగా రైతులు ఎద్దులపై రంగురంగుల వస్త్రాలు కప్పి, కొమ్ములకు రంగులు వేసి బెలూన్లతో అలంకరించి హనుమాన్ ఆలయాల చుట్టూ వాటితో ప్రదక్షిణ చేయించడం ఆనవాయితీ. ఖేడ్ నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడతారు. కాగా ఎద్దులను అలంకరించే సామగ్రికి సంబంధించిన దుకాణాలు ఆదివారం రైతులతో కిటకిటలాడాయి.


