భగీరథ పైపులైన్‌ లీకేజీ.. | - | Sakshi
Sakshi News home page

భగీరథ పైపులైన్‌ లీకేజీ..

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకై నీరు వృథాగా పోతుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కూకుట్లపల్లి గ్రామానికి మిషన్‌ భగీరథ సరఫరా అయ్యే పైపులైన్‌ పెద్దచెరువు కట్ట సమీపంలో ప్రాథమిక పాఠశాల వద్దగల కట్‌వాల్‌ వద్ద నాలుగురోజులుగా లీకేజీ ఏర్పడి నీరు వృథాగా పోతుంది. దీంతో రక్షిత మంచినీటి ట్యాంకుకు నీరు రాకపోవడంతో గ్రామంలో నీటి సమస్య తలెత్తింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement