గ్రామాల అభివృద్ధే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

కొండాపూర్‌(సంగారెడ్డి): గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని తేర్పోల్‌లో రూ.8 లక్షలతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులతో నిర్మించనున్న ఓపెన్‌ డ్రైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేను సర్పంచ్‌ సతీశ్‌ సన్మానించారు. చెర్ల గోపులారంలో జరిగిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చిన్నారులకు చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు విఠల్‌, సదాశివపేట మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, మోహన్‌ గౌడ్‌, మల్లేశం, శేఖర్‌, మన్సూర్‌, సర్పంచ్‌ రామ్‌ చందర్‌, మోహన్‌, కృష్ణ, మాజీ సర్పంచ్‌ ప్రకాశ్‌, మాజీ ఎంపీటీసీ అనంత రాములు గౌడ్‌, పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement