ఇస్నాపూర్‌ వరకు మెట్రోను విస్తరించాలి | - | Sakshi
Sakshi News home page

ఇస్నాపూర్‌ వరకు మెట్రోను విస్తరించాలి

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వినతి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వినతి

పటాన్‌చెరు టౌన్‌: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2లో మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు మీదుగా ఇస్నాపూర్‌ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించాలని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని శనివారం హైదరాబాద్‌లో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ...పటాన్‌చెరు–పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం, ఐఐటీ హైదరాబాద్‌, గీతం యూనివర్సిటీతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మెట్రో కారిడార్‌ను ఫేజ్‌–2లో చేర్చాలని కోరారు. ఈ మార్గం అమలైతే సంగారెడ్డి, పటాన్‌చెరు, ఇస్నాపూర్‌ ప్రాంతాలతోపాటు జాతీయ రహదారి–65పై ట్రాఫిక్‌ రద్దీ తగ్గి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెట్రో రైల్‌ సాధన సమితి సభ్యులు రుద్రారం శంకర్‌, మెట్టు శ్రీధర్‌, సురేందర్‌, సాయి తేజ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement