సంగారెడ్డి: మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య పిలుపు నిచ్చారు. శనివారం సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం, మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన చట్టాలు, సమాజంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియో గం నేరమని, వాటికి సంబంధించిన చట్టపరమైన శిక్షలు, విద్యాహక్కు, పోక్సో, సైబర్ క్రైమ్, బాల్య వివాహాల చట్టం, బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు.


