మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయాలి

Jun 27 2026 7:30 AM | Updated on Jun 27 2026 7:30 AM

జాతీయ మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కమలాక్షి

రామచంద్రాపురం (పటాన్‌ చెరు): కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును వెంటనే అమలు చేయాలని జాతీయ మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కమలాక్షి డిమాండ్‌ చేశారు. రామచంద్రాపురం పట్టణంలో జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కాటా సుధా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా మహిళా కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆమె తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లి వివరించాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మహిళా కాంగ్రెస్‌ను మరింత పటిష్టం చేయాలని సూచించారు. మహిళల రాజకీయ సాధికారతకు మహిళా బిల్లు కీలకమని తెలిపారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మలారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు స్వర్ణ, ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంజలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement