నారాయణఖేడ్: ఖేడ్ పట్టణానికి చెందిన యువకుడు సున్నపు భవానీ కుమార్(22) శుక్రవారం తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సైకిల్‌పై బయలుదేరి వెళ్లాడు. హనుమాన్‌న్ ఆలయంలో కుటుంబీకులు, సన్నిహితులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి సైకిల్‌పై యాత్రను ప్రారంభించాడు. రోజూ 60 కిలోమీటర్ల మేర ప్రయాణించి జూలై 5న తిరుమల తిరుపతికి చేరుకొని అక్కడ దర్శనం చేసుకోనున్నట్లు తెలిపాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కొందరు భక్తులు సైతం సైకిల్‌పై తిరుపతికి వెళ్తుండగా పెద్దశంకరంపేటకు వారు చేరుకున్నాక వారితో కలిసి సమష్టిగా వెళ్తామని వివరించాడు. కాగా గతేడాది కూడా భవానీకుమార్ అయ్యప్పస్వామి దీక్షను స్వీకరించి తిరుపతికి పాదయాత్రగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.


