ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలి

Jun 27 2026 7:30 AM | Updated on Jun 27 2026 7:30 AM

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మంచి ఆదాయాన్నిచ్చే ఆయిల్‌పామ్‌ పంటను సాగు చేసుకోవాలని జహీరాబాద్‌ ఉద్యాన వన శాఖ అధికారి పండరి రైతులకు సూచించారు. మండల పరిధిలోని హద్నూర్‌ గ్రామంలో శుక్రవారం ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్‌ సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 3,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారని తెలిపారు. సాగు చేసిన పంట మూడేళ్ల తర్వాత నుంచి నెలకు రూ.లక్షా వరకు ఆదాయం వస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్నిచ్చే పంటను సాగు చేసుకోవాలని రైతులను కోరారు. పంట సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కార్యక్రమంలో కొండల్‌రావు, సూర్యతేజ, సాయి పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement