నారాయణఖేడ్: పట్టణంలో శ్రీకాసం ఫ్యాషన్స్‌శ్రీ 25వ షోరూమ్‌ను ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధునాతన కలెక్షన్లు, సరికొత్త వైరెటీలకు కాసం ఫ్యాషన్స్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని, దీనిని నారాయణఖేడ్‌లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆమె మాల్‌లోని లేడీస్, జెంట్స్, కిడ్స్ వేర్ విభాగాలను పరిశీలించి సందడి చేశారు. అనంతరం పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడే షాపింగ్ చేయాలని కోరారు. అనంతరం మాల్ డైరెక్టర్లు కాసం నమశివాయ, మల్లికార్జున్, కేదారినాథ్, శివప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లుగా ప్రజల ఆదరణతో 25 స్టోర్లు ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలకే అందిస్తున్నామని, ఈ బ్రాంచ్ ద్వారా 150 మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించినట్లు తెలిపారు. అయితే అనసూయను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో మాల్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, పుల్లూరు అరుణ్ కుమార్, విశాల్, వరుణ్, అరుణ్, కార్తీక్, కాసం ఫణిత్, కాసం సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభించిన ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్


