కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: మాదక ద్రవ్యాలకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఐబీ గెస్ట్‌హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్ దుర్వినియోగం, సర్ ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి, యువతకు ముప్పుగా మారుతోందన్నారు. అర్హత కలిగిన ప్రతీ పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..డ్రగ్స్ విక్రయం, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.
వసతి గృహాల్లో మెరుగైన భద్రత
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు, భద్రత కల్పించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వసతిగృహాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..విద్యార్థులు ఆరోగ్యకరమైన, పరిశుభ్రతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అభ్యసించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
సర్‌కు పార్టీలు సహకరించాలి
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనల ప్రకారమే ఎస్‌ఐఆర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల వివరాల ధృవీకరణలో ప్రజలు బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, తదితరులు పాల్గొన్నారు.


